జయలలితకు ఒక న్యాయం, జగన్‌కు మరో న్యాయమా: కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్
విజయవాడ, జులై 7: ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో జగన్ పట్ల కేంద్ర ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. దివంగత సీఎం జయలలితకు ఒక న్యాయం, జగన్‌కు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. విజయవాడలో జరిగిన ఒక సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామమందిరం పేరుతో బీజేపీ వేల కోట్లు వసూలు చేసి అవినీతికి పాల్పడిందని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం ఉందని తెలిసి కూడా ప్రధాని మోదీ ఇజ్రాయెల్ ఎందుకు వెళ్లారో సమాధానం చెప్పాలన్నారు. వేలాది మంది చిన్న పిల్లల ప్రాణాలు కోల్పోతుంటే భారత విదేశాంగ...