జగిత్యాల పట్టణ మేదరి సంఘం నూతన అధ్యక్షుడిగా చింత రమేష్..
జగిత్యాల పట్టణ మేదరి సంఘం నూతన అధ్యక్షుడిగా చింత రమేష్ ఎన్నికయ్యారు. పట్టణ మేదరి సంఘం కార్యవర్గ ఎన్నికలు ఆదివారం స్థానిక హనుమాన్‌వాడలోని సంఘ భవనంలో నిర్వహించారు. అధ్యక్ష పదవికి ముగ్గురు అభ్యర్థులు పోటీ చేయగా, చింత రమేష్‌కు అత్యధికంగా 128 ఓట్లు లభించాయి. చింత గంగారాంకు 79 ఓట్లు, చింత గంగాధర్‌కు 44 ఓట్లు రావడంతో సమీప ప్రత్యర్థిపై 49 ఓట్ల మెజారిటీతో చింత రమేష్ జగిత్యాల పట్టణ మేదరి సంఘం అధ్యక్షుడిగా విజయం సాధించారు. కనికరపు శ్రీనివాస్, చింత నరేష్, పిల్లి శ్రీనివాస్, చింత సంతోష్, చింత రాజమల్లు, మదిరే కృష్ణ చైతన్యలు ఎన్నికల అధికారులుగా వ్యవహరించి ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. మేదరి...