ఈ20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా దేశంలో తొలి నిరసన..
కేంద్రం ప్రవేశపెట్టిన ఈ20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా దేశంలో తొలి నిరసన ప్రదర్శన జరిగింది. దేశరాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆదివారం కార్ ఓనర్లు ఆందోళన నిర్వహించారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ20 పెట్రోల్ వల్ల తమ వాహనాలు పాడవుతున్నాయంటూ ఆందోళన చేశారు. అంత తొందరగా ఈ20 పెట్రోల్ వినియోగాన్ని ఎందుకు తెచ్చారంటూ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేశారు. ఇది ఈ20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా దేశంలో రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగిన తొలి నిరసన. ‘హమారా గాడి, హమారా అధికార్’ అంటూ కార్ ఓనర్లు ఈ నిరసన చేశారు. ఈ కార్యక్రమంలో టీవీ నటుడు, వ్యాపారి తెహ్సీన్ పూనావాలా సహా పలువురు ప్రముఖులు, ఆటో మొబైల్ నిపుణులు,...