పారదర్శక ఓటరు జాబితా.. ప్రజాస్వామ్యానికి పునాది

దేవరకొండ 05జూలై (BVK 3 న్యూస్ ) : ప్రజాస్వామ్య వ్యవస్థకు అసలైన బలం ఓటరు. ఆ ఓటరు గుర్తింపే ఓటు హక్కు. అంతటి కీలకమైన ఓటు హక్కును ప్రతి అర్హుడికీ కల్పించడంలోనూ, ఎలాంటి తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించడంలోనూ బూత్ స్థాయి అధికారుల (BLO) పాత్ర అత్యంత విలువైంది. తాజాగా నల్గొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో క్షేత్రస్థాయి పర్యటన చేసి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SSR) ప్రక్రియను స్వయంగా పరిశీలించడం శుభపరిణామం. ఉన్నతాధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా ఇలా క్షేత్రస్థాయికి వచ్చినప్పుడు మాత్రమే వ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుంది. ఎన్నికలు...