కూటమి ప్రభుత్వ దృష్టంతా అభివృద్ధి, సంక్షేమంపైనే
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకెళ్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాష్ట్రాభివృద్ధికి పరిశ్రమలే ప్రధాన ఆధారమని, పెట్టుబడులు వస్తేనే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలోని బూదిగుమ్మ సమీపంలో నిర్వహించిన 'రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం' విజయోత్సవ సభలో మంత్రి పయ్యావుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏపీకి, ఉరవకొండ నియోజకవర్గానికి చేసిన పనులను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల మాట్లాడుతూ.. ఉరవకొండలో రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక...