నల్గొండ హ్యాట్రిక్ వీరాంగనలు – పట్టుదల, మార్గదర్శకత్వాల అద్భుత విజయం

దేవరకొండ 04జూలై (BVK 3 న్యూస్ ) : నేటి కాలంలో క్రీడలు అంటే కోట్లాది రూపాయల అకాడమీలు, అత్యాధునిక వసతులతోనే ముడిపడి ఉన్నాయనే భావన పెరిగిపోతున్న తరుణంలో, నల్గొండ జిల్లా నుండి ఒక అద్భుతమైన విజయగాథ వెలుగులోకి వచ్చింది. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) హైదరాబాద్ రీజియన్ నిర్వహించిన రీజినల్ స్పోర్ట్స్ మీట్‌లో, PM SHRI కేంద్రీయ విద్యాలయం (నల్గొండ) అండర్-17 బాలికల ఖో-ఖో జట్టు వరుసగా మూడేళ్లు (2024, 2025 మరియు 2026) బంగారు పతకాలను కైవసం చేసుకుని అద్భుతమైన 'హ్యాట్రిక్' సాధించింది. ప్రాంతీయ క్రీడా చరిత్రలో తమ పేర్లను సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. ఈ వరుస విజయాలు కేవలం క్రీడా రంగానికి సంబంధించిన...