ద‌మ్మ‌పేట‌లో స‌బ్ కోర్టు ఏర్పాటుకు విన‌తి

దమ్మపేట, జూలై 4 : ద‌మ్మ‌పేట‌లో నూత‌నంగా స‌బ్ కోర్టు ఏర్పాటు చేయాల‌ని కోరుతూ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె శ్రీనివాస్ రావుకు దమ్మపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొంది మురళీమోహన్ విన్న‌వించారు. శ‌నివారం కొత్త‌గూడెం జిల్లా కోర్టుకు వ‌చ్చిన జ‌స్టిస్ శ్రీ‌నివాస్‌రావును మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి చిరు స‌త్కారం చేసి ప‌లు అంశాల‌తో కూడిన‌ విజ్ఞాప‌న ప‌త్రం అంద‌జేశారు. కోర్టులో సిబ్బంది చాలా తక్కువగా ఉండడం వల్ల ఇబ్బంది కలుగుతుందని, త్వరగా కోర్టు సిబ్బందిని నియమించాల్సిందిగా అభ్యర్థించారు. అలాగే దమ్మపేట కోర్టులో న్యాయదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేయుటకు అనుమతి ఇవ్వవాల్సిందిగా జ‌స్టిస్‌ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ లక్కీనేని నరేంద్రబాబు, ట్రెజరర్...