ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి రూ.34 వేల విరాళం..
- మాట నిలబెట్టుకున్న సర్పంచ్ - ఐదు నెలల జీతాన్ని చెక్కు రూపంలో అందజేసిన డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి నారాయణపేట, జూలై 3 (బీవీకే న్యూస్) మక్తల్ మండలంలోని మహాద్వార్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి గ్రామ సర్పంచ్ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తన వంతు సహకారాన్ని అందిస్తూ మరోసారి ఆదర్శంగా నిలిచారు. గతంలో గ్రామసభలో ఇచ్చిన హామీ మేరకు తన ఐదు నెలల జీతానికి సమానమైన రూ.34 వేల చెక్కును శుక్రవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరాములు, ఉపాధ్యాయులు ఆంజనేయులు, రాములకు వార్డు సభ్యుల సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన వసతుల కల్పన, నాణ్యమైన...