బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరిన జయానంద్

నారాయణపేట, జులై 3 (బీవీకే న్యూస్) బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎం. జయానంద్ భారతీయ జనతా పార్టీలో (బీజేపీ) చేరారు. మక్తల్‌లో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, బీజేపీ రాష్ట్ర నాయకుడు కొండయ్య ఆయనకు కమలం కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యంగా దేశం ముందుకు సాగుతోందన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందని పేర్కొంటూ, బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన జయానంద్‌కు తగిన గుర్తింపు లభిస్తుందని...