మెడికల్, ఇంజినీరింగ్ అడ్మిషన్లలో బోర్డు ఎగ్జామ్ మార్కులకు వెయిటేజీ!

ప్రస్తుతం భారత్‌లో ఉన్న పోటీ పరీక్షల తీరుతెన్నులపై విమర్శలు పెరుగుతున్నాయి. పేపర్ లీకేజీ ఉదంతాలు, విపరీత పోటీతో విద్యార్థులపై ఒత్తిడి, కోచింగ్ సెంటర్ల నిర్వాకాల నేపథ్యంలో పోటీ పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు జరగాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెడికల్, ఇంజనీరింగ్ అడ్మిషన్లకు పోటీ పరీక్షల ర్యాంకుతో పాటు బోర్డు ఎగ్జామ్ మార్కులను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్న అంశంపై ప్రభుత్వ వర్గాలు పరిశీలిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అడ్మిషన్ల సమయంలో బోర్డు ఎగ్జామ్ మార్కులకు ఏకంగా 50 శాతం వెయిటేజీ ఇవ్వాలనే అంశం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ‘బోర్డు ఎగ్జామ్ మార్కులకు 50 శాతం వెయిటేజీతో పాటు, పాఠశాల సిలబస్‌కు దగ్గరగా పోటీ పరీక్షల...