హమీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా తెలంగాణ ప్రజానీకానికి ఇచ్చిన హమీలను విస్మరించిందని ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. గురువారం గుర్రంపోడ్‌ మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ‌న‌ మాట్లాడారు. ఎన్నికల ముందు అమలు కాని హమీలను ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆ హమీలను ముఖ్యమంత్రి, మంత్రులు మర్చిపోయారన్నారు. 2014 కంటే మందు తెలంగాణ వ్యవసాయ రంగం దయనీయంగా ఉండేద‌ని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ రైతు కుటంబం నుండి వచ్చినవారు కాబట్టి రైతాంగం కష్టాలను చూసి రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌తో పాటు ముందు చూపుతో ఎరువులను, సాగు నీరును...