హరిత విప్లవ వీరుడు

పద్మశ్రీ వనజీవి రామయ్య (జూలై 1 (1937 )పద్మశ్రీ వనజీవి రామయ్య గారి 89 వ జన్మదినం) (కోట్లాదిమొక్కలునాటిఆకుపచ్చని వనంగా మార్చినప్రకృతిప్రేమికుడు పద్మశ్రీ ధరిపెల్లి రామయ్య జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ రాసిన కవిత) చేతిలో విత్తనం గుండెలో ఆశయం మట్టిని నమ్ముకున్న మహోన్నత జీవితం ధరిపెల్లి రామయ్యది తన బాల్యంలో టీచర్ మల్లేశం చెప్పిన మొక్కల పెంపకం లాభాలు అనే పాఠం ఆయన మనసుపై బలమైన ముద్రవేసింది సైకిల్ చక్రాలపై తిరిగి అడవుల్లో చెట్లు నాటిన హరిత విప్లవ వీరుడు పద్మశ్రీ వనజీవి రామయ్య సైకిల్ హ్యాండిల్ కు తగిలించిన పచ్చని సంచే డిల్లీ పీఠాన్ని కదిలించిన ఒక విప్లవ కేతనం ధరణికి పచ్చని...