సెమీకండక్టర్, కృత్రిమ మేధస్సు రంగ అవకాశాల అన్వేషణకు ప్రపంచ ఆవిష్కర్తలకు ఐసీఐఈ తైవాన్ కు ఆహ్వానం

తైవాన్‌లోని ఐఐఐ, ఎన్‌వైసీయూ సంస్థలతో వ్యూహాత్మక చర్చలు నిర్వహించిన సందీప్ కుమార్ మక్తాల 👉 జూలై 29 నుంచి ఆగస్టు 2 వరకు తైవాన్‌లో సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు, స్టార్టప్‌లు, పరిశోధన, ఆవిష్కరణ రంగాలపై అంతర్జాతీయ ప్రతినిధి బృందం పర్యటన నారాయణపేట, జూన్ 29 (బివికే న్యూస్) ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, సాంకేతికత, పారిశ్రామికత, విద్యా రంగ సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ ఇన్నోవేటర్స్ అండ్ ఎంట్రప్రెన్యూర్స్ (ఐసీఐఈ) ఆధ్వర్యంలో “ఎక్స్‌ప్లోర్ టు ఎక్స్‌పాండ్ తైవాన్” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఐసీఐఈ వ్యవస్థాపక కన్వీనర్ సందీప్ కుమార్ మక్తాల తైవాన్ ప్రభుత్వానికి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇన్ఫర్మేషన్...