కేతన్ మర్డర్ కేసు.. అరగంట ముందు ప్రియుడితో 'సీక్రెట్ కాల్'!
హారాష్ట్ర పుణెకు చెందిన ప్రముఖ యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు అరగంట ముందు సియా గోయల్.. తన ప్రియుడు చేతన్ చౌదరీకి ఫోన్ చేసి రహస్యంగా మాట్లాడినట్టు కాల్ డీటెయిల్ రికార్డ్స్(CDR) ఆధారంగా అధికారులు కనుగొన్నారు. మొబైల్ ఫోన్ల ఫోరెన్సిక్ విశ్లేషణ, సీడీఆర్ పరిశీలనలో ఈ విషయం బయటపడినట్టు తెలిపారు. ఈ కాల్‌ను కుట్రకు సంబంధించిన అత్యంత కీలక డిజిటల్ ఆధారంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ సంభాషణలో కేతన్‌తో తానున్న ప్రాపర్ లొకేషన్‌ను ప్రియుడు చేతన్‌కు సియా తెలిపిందని, అక్కడ ఇతర పర్యాటకులెవరూ లేరని నిర్ధారించినట్లు అనుమానిస్తున్నారు. హత్యకు సంబంధించిన ప్రణాళికను దాచిపెట్టేందుకు మూడు నెలలుగా...