పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం

- జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక - చుక్కల మందుకు చక్కని స్పందన నారాయణపేట, జూన్ 28 (బి వి కే న్యూస్) ఐదేళ్ళలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలని జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రతి ఒక్క చిన్నారికి పోలియో చుక్కలు వేయాలన్నారు. O నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న చిన్నారులందరికీ తప్పకుండా పోలియో...