గిరిజనుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించి 50 సంవత్సరాలు" పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఇతర ప్రజాప్రతినిధులు చేపడుతున్న బస్సు యాత్రలో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట మండలం, లక్ష్మాపూర్ తండాలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మాపూర్ తండాలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన పీర్ల పండుగ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తదుపరి మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి, గ్రామంలోని గిరిజనులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా...