మున్సిపల్ చైర్ పర్సన్ జన్మదినం సందర్భంగా ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ లో మున్సిపల్ చైర్ పర్సన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పచ్చదనాన్ని పెంపొందించడం మరియు పర్యావరణ సమతుల్యతను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఈ రాజు,మున్సిపల్ కమిషనర్,పర్యావరణ పరిరక్షణ అధికారి: శత్రు నాయక్,వార్డు కౌన్సిలర్లు, స్థానిక మహిళలు మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.