బుల్లెట్‌, కాలిన గాయాల‌తో.. కారులో శ‌వాలైన ల‌వ‌ర్స్‌

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ప్రేమికులు అనుమానాస్ప‌ద రీతిలో మృతిచెందారు. ఓ కారులో ఆ ఇద్ద‌రి మృతదేహాల‌ను గుర్తించారు. అశోక్‌న‌గ‌ర్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. పార్క్ చేసిన కారులో ఆ జంట శ‌వాల‌ను గుర్తించారు. డ్రైవ‌ర్ సీటులో ఉన్న వ్య‌క్తిని రితిక్‌ సోనీగా అనుమానిస్తున్నారు. అత‌ని త‌ల‌లో బుల్లెట్ దిగింది. ముఖంపై కాలిన గాయాలు కూడా ఉన్నాయి. ఇక ఆ కారులోనే ప‌క్క సీటులో ఉన్న మ‌హిళ‌ను ముస్కాన్‌గా గుర్తించారు. ఆమె గొంతు కోసి ఉన్న‌ది. ఆ ఇద్ద‌రూ అశోక్‌న‌గ‌ర్ వాసులే. ముస్కాన్ కుటుంబం పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. బుధ‌వారం మ‌ధ్యాహ్నం జిమ్‌కు వెళ్తున్న‌ట్లు చెప్పి ముస్కాన్ ఇంటి నుంచి వెళ్లిపోయింది. కానీ ఆమె మ‌ళ్లీ తిరిగిరాలేదు. కాంటాక్ట్ కోసం...