టీసీఏ స్వర్ణోత్సవాలు.. భారత కాన్సుల్ జనరల్‌కు ఆహ్వానం.

తెలుగు సాంస్కృతిక సమితి (TCA) కార్యనిర్వహక కమిటీ అధ్యక్షుడు కే యాదగిరి రెడ్డి, చార్లీ చౌదరిలు భారత కాన్సుల్ జనరల్ డీసీ మంజునాథ్‌ను మర్యాదపూర్వంగా కలిశారు. ఆగస్టు 7, 8 తేదీలలో జరగనున్న TCA స్వర్ణోత్సవాలకు (Golden Jubilee) ముఖ్య అతిథిగా హాజరుకావలసిందిగా అహ్వానించారు. ఈ సందర్భంగా తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ, తెలుగు సమాజ ఐక్యత, యువతలో తెలుగు భాషాభిమానాన్ని పెంపొందించే అంశాలపై చర్చించారు. తెలుగు వారందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి, తెలుగు సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే చారిత్రాత్మక వేడుకలను మరింత ఘనంగా నిర్వహించేందుకు టీసీఏ ఏర్పాట్లు చేస్తోంది.