క‌ల నిజ‌మాయే.. నాకౌట్ బెర్తుతో చ‌రిత్ర సృష్టించిన ద‌క్షిణాఫ్రికా..!

ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ద‌క్షిణాఫ్రికా(South Africa) చ‌రిత్ర సృష్టించింది. ఏళ్ల ఎదురుచూపుల‌కు మంగళం ప‌లుకుతూ తొలిసారి లీగ్ ద‌శ‌ను దాటింది. గ్రూప్ స్టేజ్ చివ‌రి మ్యాచ్‌లో ద‌క్షిణ కొరియాను ఓడించిన‌ స‌ఫారీ టీమ్ నాకౌట్‌లో అడుగుపెట్టింది. కీల‌క‌మైన గోల్‌తో త‌పెలో మ‌సెకో కోట్లాది మంది ఆశ‌ల్ని నిజం చేశాడు. దాంతో.. నాకౌట్ బెర్తు ద్వారా ద‌క్షిణాఫ్రికా ఫుట్‌బాల్‌లో కొత్త అధ్యాయం మొద‌లైంది. సాక‌ర్ ప్ర‌పంచ‌క‌ప్‌లో ద‌క్షిణాఫ్రికా క‌ల నిజ‌మైంది. ప్ర‌తిసారి లీగ్ ద‌శ‌లోనే నిష్క్ర‌మించే ఆ జ‌ట్టు ఈసారి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ నాకౌట్‌కు దూసుకెళ్లింది. కెన‌డా, మెక్సికో, అమెరికా సంయుక్తంగా ఆతిథ్య‌మిస్తున్న ఎడిష‌న్‌ను స‌రైన స‌న్నాహ‌కాలు లేకుండానే ఆరంభించిన స‌ఫారీ టీమ్.. మెక్సికో చేతిలో కంగుతిన్నది.