ఓ మనిషి సతి లేని పతి జీవితం వెలుతురు లేని ఇల్లు
(సతి లేని పతి జీవితం అధోగతే అన్న అంశంపై స్పందిస్తూ రాసిన కవిత) మనిషి జీవితం వివాహంతో మొదలౌతుంది మూడుముళ్లతో సతి పతి బంధం ఏర్పడుతుంది సృష్టిలో తీయనిది సతి పతుల బంధం అగ్ని సాక్షిగా అడుగులేసి నూరేళ్ళ ప్రయాణానికి భాషలు చేసి కష్టాల కడలిని ఈదుతూ సంసార సాగరంలో తోడుగా సాగే అనురాగ గీతం సుఖ దుఃఖాల్లో భాగస్వాములై సంతాన సౌభాగ్యమే సంపదగా సంతృప్తియే జీవిత పరమావధిగా జీవిస్తున్న కాలంలో సతిని అకాల మృత్యువు కభలిస్తే తీవ్ర కలతచెంది మనస్థాపానికి గురైన పతికి ఒంటరి తనమే తోడైంది నీడైంది పరాథీనతే పెన్నిదైంది సతిలేని పతి జీవితం దిక్కుతోచని ఒక అరణ్యం అండగా నిలిచే దీపం...