కాంగ్రెస్ సర్కార్ మా విలేకర్లను కూడా సతాయిస్తోంది..

సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. నేను మాట్లాడే ముందు పత్రికా మిత్రులొచ్చారు. అన్నా మాకు కూడా ఓ సమస్య ఉంది. మీరు ప్రస్తావించాలి అన్నారు. పత్రికలను చూసే మంత్రి ఐ అండ్ పీఆర్ మినిస్టర్‌ది సత్తుపల్లి నియోజకవర్గమే కదా ‌.. మరి వారికేం సమస్య ఉంటదనుకున్నా. రాష్ట్రంలో ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా ఇబ్బందిపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన విలేకరు సోదరులను కూడా సతాయిస్తోందన్నారు. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు నియోజకవర్గ స్థాయిలో పనిచేసే రిపోర్టర్లు ఎవరైతే ఉంటారో వారి హోదాను గుర్తిస్తూ.. మీరు తాలూకా స్థాయిలో పనిచేస్తున్న...