భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు- జూన్​ 24న తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు బుధవారం భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న ఒడిదుడుకులు, డాలర్‌ మారకం విలువల్లో మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ధోరణుల్లో మార్పుల ప్రభావంతో పసిడి, వెండి ధరలు దిగివచ్చాయి. దీంతో ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభించింది. క్యాప్స్‌ గోల్డ్‌ వెబ్‌సైట్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, బుధవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,47,290గా నమోదైంది. గత ట్రేడింగ్‌ సెషన్‌లో ఈ ధర రూ.1,49,715గా ఉండగా, ఒక్కరోజులోనే రూ.2,425 మేర తగ్గింది. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు, ముంబయి మార్కెట్లలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. బెంగళూరులో 10...