‘నా భర్త అన్ని లిమిట్స్ క్రాస్ చేశాడు’.

విశాఖకు చెందిన టెకీ రాధాగాయత్రి మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. భర్తతో కలిసి ఉత్తరాఖండ్‌ వెళ్లిన రాధాగాయత్రి అక్కడి హోమ్‌స్టేలో మృతిచెందిన విషయం తెలిసిందే. మొదట అనుమానాస్పద కేసుగా నమోదు అయినప్పటికీ.. గాయత్రి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త శ్రీచరణ్‌పై ముస్సోరి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తాజాగా రాధాగాయత్రికి చెందిన చివరి ఆడియో వెలుగులోకి వచ్చింది. భర్త ప్రవర్తనపై గాయత్రి తన తల్లితో చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేసింది. నా మనసు పూర్తిగా విరిగిపోయింది. నా మీద అనుమానం, నా గురించి చెడుగా ప్రచారం చేస్తున్నాడు. నేనేదైనా తప్పు చేస్తే నేరుగా అడగమని మా అత్తయ్యతో అన్నాను. నేను ఇక...