కీమోథెరపీతో వెంట్రుకలు ఊడిపోతే.. అమ్మాయిల ఉన్నావంటూ క్యాన్సర్ పేషెంట్‌పై ముగ్గురు పోలీసుల లైంగిక దాడి

క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ యువకుడిపై ముగ్గురు పోలీసులు దారుణానికి ఒడిగట్టారు. కీమోథెరపీ చికిత్సతో కాళ్లు, చేతులకు వెంట్రుకలు ఊడిపోవడంతో అమ్మాయిలు ఉన్నావంటూ వేధించడమే కాకుండా, అతనిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. హర్యానాలోని కురుక్షేత్ర జిల్లాలో జరిగిన ఈ ఘటలన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ముగ్గురు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. బాధితుడి కథనం ప్రకారం.. హర్యానాలోని కురుక్షేత్ర జిల్లా బన్‌గావ్ గ్రామానికి చెందిన ఓ యువకుడు (30) బ్యాంక్ ఉద్యోగి. కొంతకాలంగా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న అతను కీమోథెరపీ చికిత్స తీసుకుంటున్నాడు. జూన్ 17వ తేదీన రాత్రి తన బైక్‌పై ఇంటికి వెళ్తుండగా ఇంద్రి రోడ్డులో పోలీసులు తనిఖీ కోసం వాహనాన్ని ఆపారు. మొహానికి...