ఆరోగ్య ప్రదాత సూర్య నమస్కారాలు
తూర్పు కొండల వెనుక నుండి బంగారు కిరణాల భానుడు రాగా మేల్కొన్న ప్రకృతి పులకించగా మొదలవుతుంది ఆరోగ్యయోగం ద్వాదశ రూపాల ఆసన విన్యాసం దేహానికి ఇచ్చును నవవికాసం శ్వాసపై ధ్యాస నిలిపి చేస్తే దూరమగను మానసిక ఆయాసం మాయమవును కుంగుబాటు ప్రణామ ఆసనంతో మొదలై భుజంగాసనంతో బలమునిచ్చి పాదహస్తాసన భంగిమలతో వెన్నెముకను నిటారుగా నిలిపి హార్మోన్ల సమతుల్యతతో ఉల్లాసం ఉత్సాహం హుషారు పెరుగును వ్యాకులత తగ్గును సూర్య నమస్కారాలతో శారీరక మానసిక ఆధ్యాత్మిక సమతుల్యత చేకూరుతుంది సూర్య నమస్కారాలు శరీరాన్ని లోపల నుండి శుద్ధి చేసే సంపూర్ణ ప్రక్రియ సూర్యనమస్కారాల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు సిద్ధిస్తాయి శరీరం మొత్తం కదలికల వల్ల పొట్ట నడుము...