క్రమశిక్షణతో కూడిన జీవనశైలితో లక్ష్య సిద్ధి సుసాధ్యం - కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి, విశ్రాంత ప్రిన్సిపాల్, కాలమిస్ట్‌, వ్యక్తిత్వ వికాస నిపుణులు

సక్రమమైన క్రమశిక్షణతో కూడిన దిన చర్యను అలవాటు చేసుకోవడం వల్ల ఎంచుకున్న రంగంలో తప్పక రాణించవచ్చని ప్రముఖ వ్యక్తిత్వ వికాస శిక్షకులు, రచయిత, విశ్రాంత ప్రిన్సిపల్ కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈ రోజు సెయింట్ జార్జ్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో ఫాతిమానగర్‌ అడోరేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నోట్‌ బుక్స్‌, పెన్స్‌, పెన్సిల్స్‌, స్కూలు బ్యాగులు, స్కూల్‌ యూనిఫామ్స్‌, డ్రస్సులు లాంటి విద్యకు సంబంధించిన ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పిల్లలు బాగా చదవాలి నైతిక విలువలతో , క్రమశిక్షణతో కూడిన ఉన్నత విద్యను అభ్యసించి సమాజంలో మంచి పౌరలుగా గుర్తింపు పొందాలని సమయపాలనతో...