శారీరక మానసిక ఆరోగ్యానికి దివ్య ఔషధం యోగ
హైటెక్ యుగంలో ఉరుకుల పరుగుల జీవితంలో నిరంతరం కాలంతో పోటీ పడుతున్న మానవుని జీవితంలో శరీరము మనసు తీవ్ర ఒత్తిడికి గురౌతుంది . ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే దివ్యౌషధం యోగ . యోగాను ప్రపంచ దేశాలకు భారతదేశం పరిచయం చేసింది .క్రీస్తు పూర్వం పతంజలి మహర్షి యోగ ను అభివృద్ధి చేసి ప్రపంచానికి అందించాడు. భారతదేశం నుంచి ఉద్భవించిన జైన' బౌద్ధ ' హిందూ మతంలో యోగాకు ఒక ప్రత్యేక స్థానం కల్పించారు.20వ శతాబ్దం అనంతరం ఆరోగ్యపరిరక్షణలో యోగ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.యోగ అభ్యసించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచానికి భారత్ అందించిన అద్భుతాలలో యోగా ఒకటి. మనిషి శారీరక 'మానసిక ప్రశాంతతకు...