న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వయర్ వద్ద కాల్పుల కలకలం..
న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వయర్ వద్ద గురువారం మధ్యాహ్నం కాల్పుల కలకలం చెలరేగింది. వరుసగా తుపాకీ పేలిన శబ్దాలు వినపడగానే టూరిస్టులు, స్థానికులు ప్రాణ భయంతో అక్కడినుంచి పరుగులు పెట్టారు. కాల్పులు జరిగిన సమయంలో అదే ప్రాంతంలో ఉన్న పోలీసులు వాయు వేగంతో స్పందించారు. అనుమానితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. గాయపడ్డ వ్యక్తిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ ఘటన స్థానిక కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం సుమారు 3:40 గంటలకు జరిగింది. ఎన్‌బీఏ ఛాంపియన్ 'న్యూయార్క్ నిక్స్' విజయోత్సవ పరేడ్‌తో లోయర్ మాన్‌హట్టన్...