యోగా మన సంప్రదాయం, విజ్ఞానం, వారసత్వ సంపద

యోగా సాధనతో బాబారామ్‌దేవ్ అద్భుతాలు సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉండవల్లి గుహల దగ్గర యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. బాబారామ్‌దేవ్‌‌తో కలిసి సీఎం యోగా సాధన చేశారు. రామ్‌దేవ్ శిక్షణలో జరుగుతున్న యోగా సాధనను తిలకించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. బాబారామ్‌దేవ్‌ ఏదైనా చేయగలరన్నారు. యోగాకు.. రామ్‌దేవ్ మంచి గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు. యోగా మన సంప్రదాయం, విజ్ఞానం, వారసత్వ సంపద అని చెప్పుకొచ్చారు.