యూఎన్ మీటింగ్‌లో ఇజ్రాయెల్ ప్రతినిధి, యూఎన్ ఆఫీసర్ మధ్య తీవ్ర వాగ్వాదం
ఐక్యరాజ్యసమితి సమావేశా(United Nations Meeting)ల్లో రసాభాస నెలకొన్నది. ఇజ్రాయిల్ ప్రతినిధి డాన్నీ డాన్, యూఎన్ అధికారి వన్నెసా ఫ్రేజర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. యుద్ధ క్షేత్రాల్లో పిల్లలపై లైంగిక హింస అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఇజ్రాయెల్ ప్రతినిధి, యూఎన్ అధికారి మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం సాగింది. ఇద్దరూ గట్టిగా అరుచుకున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. యుద్ధ క్షేత్రాల్లో లైంగిక హింస నిర్మూన అంతర్జాతీయ దినోత్సవం నేపథ్యంలో చర్చలో పాల్గొన్న ఇజ్రయెల్ ప్రతినిధి డాన్నీ డానన్ మాట్లాడుతూ .. ప్రమీలా పాట్టెన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్‌లో లైంగిక హింస ఘటనలు జరిగాయని, ఆ దేశాన్ని...