ఘనంగా యంగ్ ఇండియా వెల్కమ్ కిట్స్ పంపిణీ కార్యక్రమం..

హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా వెల్కమ్ కిట్స్ పంపిణీ, డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించడంతో పాటు కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా రూ.50.73కోట్లతో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి సీఎం రేవంత్ శ్రీకారం చుట్టారు. అందులో రూ.36.65కోట్లతో వివిధ జిల్లాల్లో మినీ స్టేడియాల నిర్మాణం, క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. రూ.14.08కోట్లతో గచ్చిబౌలి, ఎల్బీ స్టేడియాల్లో బాలబాలికల క్రీడా...