గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణశాఖ గ్రీన్ సిగ్నల్ - కృతజ్ఞతలు తెలిపిన సీఎం రేవంత్
బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ అనుమతిని మంజూరు చేసింది. 83 ఎకరాల రక్షణ శాఖకు సంబంధించిన భూముల్లో మూసీ ప్రాజెక్టుకు అనుమతిచ్చింది. గోల్కొండ ఆర్టిలరీ పరిధిలోని రూ.533 కోట్ల విలువైన భూముల బదలాయింపునకు ఓకే చెప్పింది. అయితే మరోచోట రూ.533 కోట్ల విలువైన భూములు ఇవ్వాలని ప్రభుత్వానికి షరతు విధించింది. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, భారత ఆర్మీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భూముల బదలాయింపు కీలక మైలు రాయి అని అభివర్ణించారు. ముమ్మరంగా భూసేకరణ ప్రక్రియ : మూసీ, ఈసీ నదుల సంగమ స్థలిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా...