మైనర్లు డ్రైవింగ్ చేస్తూ దొరికితే స్కూల్​ పేర్లు బయటపెడతాం : విద్యాసంస్థలకు సజ్జనార్ హెచ్చరిక

రాష్ట్రంలో సోమవారం నుంచి విద్యార్థులు బడి బాట పట్టారు. చిన్నారులు సంక్షేమంగా, సురక్షితంగా ఉండేలా ప్రభుత్వం, అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే స్కూల్​ బస్సులు, ఆటోల ఫిట్​నెస్ పరీక్షలూ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మైనర్లు డ్రైవింగ్ చేయడం, డ్రగ్స్​ వినియోగించడం వంటి అంశాల పట్ల విద్యాసంస్థలను హైదరాబాద్​ సీపీ సజ్జనార్ ​హెచ్చరించారు. ఈ మేరకు నగరంలోని పలు స్కూల్​ యాజమాన్యాలతో కలిసి పలు కీలక విషయాలపై ఆయన అవగాహన సదస్సు నిర్వహించారు. ఆ పరిస్థితి తీసుకురావద్దు : మైనర్లు డ్రైవింగ్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని సీపీ సజ్జనార్​ స్పష్టం చేశారు. ఈ మేరకు నగరంలోని విద్యాసంస్థల యాజమన్యాలకు రవీంద్రభారతిలో హైదరాబాద్‌...