జీవితకాల సారధి గడియారం

మానవ జీవనసాఫల్యతలో సమయపాలన కీలక భూమిక పోషిస్తుంది ప్రగతి పురోగతి సాధనలో కాలం విలువైందని గడియారం హెచ్చరిస్తుంది టిక్ టిక్ మంటూ సాగే గడియారపు ముళ్ళు నిరంతరం శ్రమించే విరామమెరుగని ఓ కాల యంత్రం మానవ ప్రగతికి నీవే కదా సూత్రధారువు ప్రణాళికల అమలుకు నీవే కదా దిక్సూచివి నిశ్శబ్ద రాత్రుల్లో నీ ముళ్ళు కదిలినా నిద్రించే లోకానికి అలారం శబ్దంతో మేలుకొలుపు పాడుతావు జనాన్ని పనులకు పురమాయిస్తావు సుఖమున్నా కష్టమున్నా సమానంగా చూస్తూ సమదృష్టితో బతకాలని పాఠాలు నేర్పుతావు రాజునైన పేదనైన ఒకేలా చూస్తావు ధనమున్నా బలమున్నా నీ పరుగును ఆపవు గడచిన కాలం తిరిగిరాదని చెపుతూ సమయమేసంపద అని హితబోధ చేస్తావు ముందుకు...