టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక బ్యాన్‌..

నీట్ రీ-ఎగ్జామ్ నేప‌థ్యంలో టెలిగ్రామ్ యాప్‌(Telegram App)ను తాత్కాలికంగా కేంద్రం బ్యాన్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే కేంద్ర నిర్ణ‌యాన్ని ఢిల్లీ హైకోర్టు స‌మ‌ర్ధించింది. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల దృష్ట్యా ఆ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు హైకోర్టు చెప్పింది. టెలిగ్రామ్ యాప్ కేసులో ఇవాళ జ‌స్టిస్ తేజస్ క‌రియా త‌న తీర్పును వెలువ‌రించారు. సెక్ష‌న్ 69ఏ కింద ప్ర‌భుత్వం టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌ను బ్యాన్ చేసింద‌ని, ఆ యాప్‌ను బ్యాన్ చేయ‌డానికి గ‌ల కార‌ణాలు సంతృప్తిక‌రంగా ఉన్నాయ‌ని, ప్ర‌భుత్వం ర‌క్ష‌ణాత్మ‌క చ‌ర్య‌లు తీసుకున్న‌ద‌ని, కేంద్రం ఇచ్చిన ఆదేశాలు అస‌మ‌తుల్యంగా ఉన్న‌ట్లు భావించ‌లేమ‌ని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. తాత్కాలిక బ్యాన్ కోసం ప్ర‌భుత్వం స‌మ‌ర్పించిన కార‌ణాలు స‌రిపోతాయ‌ని, ప్ర‌స్తుతం ఉన్న...