మెట్రో ఫేజ్-2కు అదనంగా మరో రూ.1,915 కోట్లు - ఆలస్యమయ్యే కొద్దీ అంచనా వ్యయం పైపైకి

ప్రస్తుతం హైదరాబాద్​ నగరంలో ప్రజలకు మెట్రో అద్భుతమైన సేవలను అందిస్తోంది. 69 కిలోమీటర్ల మేర 3 కారిడార్లతో మెట్రో ఫేజ్​-1ను రూ.22,000 కోట్లతో విస్తరించారు. గతంలో ఇది ప్రైవేట్​ సంస్థ కింద ఉండగా, ఇటీవల ఇది ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. ఇక రెండో దశ మెట్రో విస్తరణకు ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రతిపాదనలను కేంద్రానికి పంపిచింది. కానీ పలు కారణాల వల్ల నిధుల విడుదలపై ఆలస్యం జరుగుతోంది. దీంతో రెండో దశ విస్తరణకు అడుగులు పడట్లేదు. దీనివల్ల మెట్రో రైలు రెండో దశ అంచనా వ్యయం పెరిగిందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. 162.5 కిలోమీటర్ల కోసం రూ.43,848 కోట్లు : గత ఏడాది అంచనాలతో పోలిస్తే...