తగ్గిన బంగారం, వెండి ధరలు- జూన్​ 19న తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?

బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి శుక్రవారం కొంత ఊరటనిచ్చే పరిణామం జరిగింది. దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న మార్పులు, డాలర్‌ కదలికలు, పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ ప్రభావంతో విలువైన లోహాల ధరలు రోజువారీగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. గతంతో పోలిస్తే ఈ ధరలో కూడా తగ్గుదల కనిపించడం గృహిణులు, పెళ్లిళ్ల సీజన్‌కు సిద్ధమవుతున్న కుటుంబాలకు కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది. క్యాప్స్‌ గోల్డ్‌ వెబ్‌సైట్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, శుక్రవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,49,600గా నమోదైంది. గత ట్రేడింగ్‌ సెషన్‌లో ఈ ధర రూ.1,55,130గాగా ఉండగా, ఒక్కరోజులోనే రూ.5,530 వరకు తగ్గింది. హైదరాబాద్‌తో...