పవన్ భూ ఆక్రమణ వివాదంపై కోర్టు కీలక ఆదేశాలు..!!
డిప్యూటీ సీఎం పవన్ కు బిగ్ రిలీఫ్. కొద్ది రోజులుగా హైదరాబాద్ కేంద్రంగా జనసేనాని పవన్ ఒక భూమి ఆక్రమించారంటూ ప్రచారం సాగుతోంది. దీని పైన పవన్ సైతం స్పందించారు. ఈ తరహా ప్రచారం పైన తాజాగా కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పవన్ కల్యాణ్ ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించేలా, నిరాధారమైన ఆరోపణలతో సాగుతున్న కంటెంట్‌ను తక్షణమే నిలిపివేయాలంటూ కోర్టు అత్యంత కీలకమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జనసేనాని పవన్ కల్యాణ్‌కు బెంగళూరు కోర్టులో భారీ ఊరట లభించింది. పవన్ కళ్యాణ్‌పై భూ ఆక్రమణ ఆరోపణలు చేస్తూ చేసిన పోస్టులపై కోర్టు బుధవారం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏపీ డిప్యూటీ సీఎం...