భర్త పైశాచికత్వం.. భార్యపై అనుమానంతో ఇంట్లో సీసీటీవీలు..
మహారాష్ట్రలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య మీద అనుమానంతో ఇంట్లో, బయట సీసీటీవీలు ఏర్పాటు చేశాడు. భార్య ప్రతి కదలికను గమనిస్తూ వేధింపులకు గురి చేశాడు. భర్త వేధింపులు తట్టుకోలేకపోయిన భార్య ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. పెళ్లై రెండు నెలలు కాకముందే ఈ విషాదం చోటుచేసుకోవటం గమనార్హం. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. థానేకు చెందిన నితిన్ తిల్కర్ అనే వ్యక్తికి విశాఖ తిల్కర్ అనే యువతితో ఏప్రిల్ 30వ తేదీన పెళ్లైంది. పెళ్లైన తర్వాత కొన్ని రోజులు నితిన్ తన భార్యను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. ఆ తర్వాత మెల్లగా తన పాడు బుద్ది...