అక్షయపాత్ర ఎలా పుట్టింది? - ద్రౌపది ఏం చేసింది??
పాండవులు జూదంలో ఓడిపోయి, అరణ్యవాసం చేస్తున్న సమయమది. ధర్మరాజు వెంట ఎంతోమంది అడవికి వచ్చారు. వారిలో బంధువులు, మహర్షులు, పురోహితులు కూడా ఉన్నారు. రాజ్యాన్ని వీడిన ఆ స్థితిలో తన వెంట వచ్చిన వారందరికీ నిత్యం భోజనం ఎలా పెట్టాలో ధర్మరాజుకు అర్థం కాలేదు. ఆ వేదనతోనే సూర్యుడిని ప్రార్థించాడు. తనకు దారి చూపించాలని వేడుకున్నాడు. ధర్మరాజు భక్తికి మెచ్చిన సూర్యభగవానుడు ఒక మహిమాన్వితమైన పాత్రను ప్రసాదించారు. అదే అక్షయ పాత్ర. క్షయము అంటే అంతమయ్యేదని అర్థం. అక్షయము అంటే ఎన్నటికీ నాశనం కానిది అని అర్థం. సూర్యుడు ప్రసాదించిన ఆ పాత్రను తన ఇల్లాలు ద్రౌపదికి అందించాడు ధర్మరాజు. ఆ పాత్ర ప్రత్యేకత ఏంటంటే.....