రికార్డు స్థాయిలో ధాన్యం ధర

మహబుబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ధాన్యం ధర ఈ సీజన్‌లో అత్యధికంగా క్వింటాకు రూ.2,906 నమోదైంది. గత 15 రోజులుగా ఈ మార్కెట్‌లో ఆర్‌ఎన్‌ఆర్‌ రకం వడ్లరేట్‌ రోజురోజుకూ పెరుగుతోంది. స్థానిక మార్కెట్‌కు బుధవారం ధాన్యాన్ని 11 మంది రైతులు 274 బస్తాల్లో తీసుకురాగా, ఎలక్ట్రానిక్ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌ (ఈ-నామ్‌) విధానంలోని ‘ఈ- వేలం’లో క్వింటాకు గరిష్ఠంగా రూ.2,906, కనిష్ఠంగా రూ.2, 226, సగటున రూ.2,589 ధరలతో వ్యాపారులు ఖరీదులు చేశారు. ధాన్యానికి ప్రభుత్వ కనీస మద్దతు ధర (ఎంఎ్‌సపీ) క్వింటాకు రూ.2,389 ఉండగా, ఈ సీజన్‌లో అంతకంటే ఎక్కువగానే మార్కెట్లో ధరలు ఉన్నాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉంటాయనే కారణాలతో...