ఉస్మానియా కాలేజీలో ర్యాగింగ్ కలకలం - 12 మంది విద్యార్థులపై కేసు నమోదు - 6 నెలలు సస్పెండ్
హైదరాబాద్ కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఉదంతం తీవ్ర కలకలం రేపింది. జూనియర్ విద్యార్థులను వేధించారనే ఆరోపణలపై పలువురు సీనియర్ విద్యార్థులపై యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది. బీడీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను ర్యాగింగ్ చేశారనే ఫిర్యాదుపై 12 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కాలేజీలో ర్యాగింగ్ జరిగినట్లు బాధితులు ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. అధికారిక ఫిర్యాదు ఆధారంగా సుల్తాన్ బజార్ పోలీసులు రంగంలోకి దిగారు. ర్యాగింగ్‌కు పాల్పడినట్లు నిర్ధారణ అయిన 12 మంది ఫైనల్ ఇయర్ బీడీఎస్ విద్యార్థులపై తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్...