చల్లటి కబురు - తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు హైదరాబాద్, కోరాపుట్, ముజఫర్​పుర్, భద్రాచలం వరకూ విస్తరించాయని వాతావరణ శాఖ బుధవారం పేర్కొంది. రానున్న నాలుగైదు రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, ఒడిశా, తెలంగాణ, బిహార్ రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించడానికి అనుకూల పరిస్థితులున్నట్లు వివరించింది. తూర్పు ఉత్తర్​ప్రదేశ్​పై ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి తూర్పు మధ్యప్రదేశ్​, విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. వడగాలులు వీచే అవకాశాలు - ఎక్కడంటే? : 'రాష్ట్రంలో గురువారం ఆదిలాబాద్​, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్​, నిర్మల్​, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్​ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం జిల్లాల్లో...