తగ్గిన వెండి ధర- స్వల్పంగా పెరిగిన గోల్డ్ రేట్- జూన్​ 18న తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

దేశీయ మార్కెట్​లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌ ప్రభావం, పెట్టుబడిదారుల కొనుగోళ్లు, పెళ్లిళ్లు మరియు శుభకార్యాల సీజన్‌ నేపథ్యంలో పసిడికి డిమాండ్‌ కొనసాగుతోంది. దీంతో గురువారం బంగారం ధరలు స్వల్పంగా పెరగగా, వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. క్యాప్స్‌ గోల్డ్‌ వెబ్‌సైట్‌ వివరాల ప్రకారం, గురువారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,55,130గా నమోదైంది. బుధవారం ఇదే బంగారం ధర రూ.1,55,030గా ఉండగా, తాజాగా రూ.100 పెరిగింది. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు, ముంబయి మార్కెట్లలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. మరోవైపు బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,230గా...