ఇష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలి

- చిన్నారులను ఆప్యాయంగా పలకరిస్తూ అక్షరాభ్యాసం చేయించిన కలెక్టర్ - కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ నారాయణపేట జిల్లా, జూన్ 16 (బి వి కే న్యూస్ ) విద్యార్థులు ఇష్టపడి చదివి జీవిత లక్ష్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ నారాయణపేట మండలం లోని జాజాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ముందుగా చిన్నారులను ఆప్యాయంగా పలకరిస్తూ అక్షర అభ్యాసం గావించారు కలెక్టర్ సిహెచ్ ప్రియాంక. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన విద్యా సంవత్సరం ప్రారంభంలో ముందుగా జాజాపూర్ పాఠశాలకు వచ్చానని, ఈ పాఠశాల వచ్చే సంవత్సరం పదో తరగతి...