బంగారం కొనాలనుకునేవారికి ఊరట- భారీగా తగ్గిన రేట్లు- జూన్ 16న ధరలు ఎంతంటే?

బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి మంగళవారం కొంత ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది. బులియన్‌ మార్కెట్‌ ప్రారంభమైన వెంటనే పసిడి ధరల్లో తగ్గుదల నమోదైంది. వెండి ధరలు కూడా భారీగా తగ్గడంతో కొనుగోలుదారులు ఊపిరిపీల్చుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న మార్పులు, డాలర్‌ కదలికలు, పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ ప్రభావంతో విలువైన లోహాల ధరలు రోజువారీగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. క్యాప్స్‌ గోల్డ్‌ వెబ్‌సైట్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర మంగళవారం రూ.1,52,780గా నమోదైంది. గత ట్రేడింగ్‌ సెషన్‌లో ఇదే బంగారం ధర రూ.1,55,470గా ఉండగా, ప్రస్తుతం దాదాపు రూ.3 వేల వరకు తగ్గింది. దీంతో ఇటీవలి రోజులుగా పెరుగుతున్న...