మహబూబాబాద్ జిల్లాలో దారుణం - అల్లుడిని రాడ్‌తో కొట్టి చంపిన మామ

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఉప్పరపల్లి గ్రామానికి చెందిన నరేశ్​(35), గత కొంత కాలంగా మద్యానికి బానిసై తన భార్యను తీవ్రంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలో భార్య పుట్టింటికి వెళ్లి నరేశ్​పై కేసముద్రం పోలీస్ స్టేషన్​లో కేసు పెట్టింది. వివాదంలో రాడ్​తో కొట్టిన మామ : నరేశ్​ది తన అత్తగారి ఊరు ఒకటే కావడంతో అక్కడికి వెళ్లి భార్య, అత్త, మామలతో ఘర్షణకు దిగాడు. దీంతో ఆగ్రహవేశాలతో నరేశ్​ మామ ఇనుప రాడ్​తో దాడి చేశాడు. దీంతో నరేశ్​ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని...