కేరళలో నిఫా వైరస్‌ అలజడి

2018 నుంచి నిఫా వైరస్‌ వ్యాప్తి పదేపదే అలజడిని రేపుతూ, దేశవాసులను భయకంపితులను చేస్తున్నది. ఇప్పటి వరకు 24 మంది ప్రాణాలను తీసిన నిఫా వైరస్‌ విజృంభిస్తే ఏ స్థాయిలో ప్రభావాన్ని చూపుతుందే అంచనాలకు అందడం లేదు. ఈ ఏడాది తొలి నిఫా వైరస్‌ కేసు కోజికోడ్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో 43 ఏండ్ల వ్యక్తికి బయట పడింది. ఈ వైరస్‌ సోకిన వ్యక్తి 10 జూన్‌ 2026 రోజున గుర్తించబడి ఐసొలేషన్‌ వార్డులో వెంటిలేటర్‌పై విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు. వెంటనే భయపడాల్సినా పని లేదని వైద్యులు చెప్పినప్పటికీ కరోనా విపత్తు చేదు అనుభవాలు నేటి పౌర సమాజానికి కంటి నిండి కునుకు లేకుండా...