పాఠశాలకు తిరిగి స్వాగతం

బడి గంట మొగనుంది.. పాఠశాల వైపు విద్యార్థుల అడుగులు! మధుర జ్ఞాపకాలకు విరామం.. పుస్తకాలతో నవశకం పాఠశాలల్లో సిద్ధమైన స్వాగత ఏర్పాట్లు ​సెలవుల సందడి ముగిసింది. వేసవి విశ్రాంతి అనంతరం సిద్దిపేట్ జిల్లాలోని మండల వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు సోమవారం (జూన్ 15) నుండి పునఃప్రారంభం కానున్నాయి. నెలల తరబడి ఆటపాటలతో, పల్లెటూరి ఒడిలో అమ్మమ్మ, తాతయ్యల ప్రేమను ఆస్వాదిస్తూ గడిపిన విద్యార్థులు, మళ్ళీ పుస్తకాల బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. వినోదానికి పుల్‌స్టాప్.. విజ్ఞానానికి శ్రీకారం ​వేసవి సెలవులు అనేగానే ముందుగా గుర్తొచ్చేవి అమ్మమ్మ, తాతయ్యల ఇళ్లు. ఉమ్మడి కొత్తగూడ మండలంలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులందరూ పల్లెటూరి వాతావరణంలో, తోటి మిత్రులతో కలిసి చెట్లు...